Tuesday 11 September 2012

సినిమా ఓకే ఓకే


నటీనటులు; ఉదయనిది స్టాలిన్, హన్సిక, సంతానం, ఆర్య, సాయాజీ షిండే, శరణ్య మరియు తదితరులు.
దర్శకత్వం ;  రాజేష్ 
 సంగీతం; హర్రీస్ జయరాజ్ .
నిర్మాత; ఉదయనిది స్టాలిన్.

ఈ మధ్య తమిళ సినిమా వచ్చిందంటే చాలు ఎంత లేదన్న చూడాలన్న ఉత్సాహం వుంటుంది ఎందుకంటే అన్ని సినిమాలు వచ్చాయి మరి. ఒక తమిళ సినిమా వచ్చిందంటే ఈ సినిమా ఎలా వుంటుందో, ఏ ప్రయోగం చేసారో చూడాలి అని ఎంతో మందికి అనిపిస్తువుండడం చాల సహజం. కాని ఇప్పుడు వచ్చిన ఓకే ఓకే మాత్రం మన ఆశలకు  విరుధం. ఈ సినిమాచూస్తే  ఒక్క సారి చూశానులే ఓకే ఓకే అని అనిపిస్తుంది.

కథ; శ్రావణ్(ఉదయనిది స్టాలిన్ )  ఒక మల్టీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు. అతనితో పనిచేసె సహా ఉద్యోగి పర్తసరతి శ్రావణ్ కు మంచి స్నేహితుడు.పోలీసు ఆఫీసర్(సాయాజీ షిండే ) కూతురైన మీరా (హన్సిక )ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు శ్రావణ్. శ్రావణ్  మీరా ను ఎంత ప్రేమించిన తన పట్ల మీరా ప్రవంతించే తీరు కథలో లో కీలకాంశం. సినిమా లోని ప్రతి అంశం ఎత్తుకో పై ఎంతో లాగ నడిచింది.సినిమా అంత ఒక మంచి సినిమా లాగ ప్రేక్షకల దృష్టిలో నిలబడిపోతుంది .

ఎప్పుడు బావుండే హర్రీస్ జయరాజ్ సంగీతాన్ని మాత్రం ఒక మారు ఆలోచించే ఈ సినిమా పాటలు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా లో ఏ పాట విన్న ఏదో ఒక సినిమా అదే ఇంతకు ముందు జయరాజ్ చేసినవి గుర్తుకువస్తాయి. ఏక పోతే హన్సిక నటన; హన్సిక మాత్రం మంచి నటనను ప్రదసించనే  చెప్పాలి. ఇక పోతే సినిమా మొత్తం కొత్త మొహాలతో తీసిన సినిమా కాబ్బటి  సినిమా మొదలైన అరగంట వరుకు ఈ సినిమా లో నిమగ్నం అవడానికి సమయం పడుతుంది.

విశ్లేషణ; ఓకే ఓకే ఓకే అని వదిలేద్దమ్మని అనికుంటే ఒక సారి వెళ్లి చుడండి. కాదు ఓకే చాల బావుండాలని వుంటే మాత్రం ఆ ఆలోచనతో మాత్రం వెళ్ళకండి.


నాగ సాయి రమ్య 

1 comment:

  1. చాలా బాగా రాసారు రమ్య గారు.

    ReplyDelete

haaram logo