Saturday 15 September 2012

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం ఈజ్ మోర్ బ్యూటిఫుల్

 ;
నటీనటులు; శ్రియ, అమల, అంజలా జవేరి, అభిజీథ్,సుధాకర్,శాగున్, జార.
సంగీతం; మిక్కి జే మేయెర్.
దర్శకత్వం; శేఖర్ కమ్ముల.
నిర్మాత;  శేఖర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల సినిమా అంటేనే అందులో ఏదో ఆహ్లాదకరమైన అంశం. అది వాస్తవానికి సంబంధించి  . ఎంతో అధ్బుతమైన చిత్రీకరణ. వీటితో జనానికి ఏదో చెయ్యాలన్న కుతూహలం మాత్రం సినిమాలోకనిపిస్తూవుండడం  సహజం. గోదావరిలో అందమైన ప్రకృతిని మరింత అందంగా చూపెట్టి జనాల్లోని అక్కడ కాసేపు ఉండాలన్న కోరికను పుటించడం , లీడర్ లో ప్రస్తుత కాలంలో మన చుట్టూ వున్న   ప్రపంచం గురించి తెలుపడం, హ్యాపీ డేస్ వంటి సినిమా తో మనం కూడా కాలేజీ రోజులను తప్పకుండా ఎంజాయ్ చెయ్యాలి, అనే కుతూహలం అందరిలో కలిపించడంలో శేఖర్ దిట్ట. ఇక కథ లోపలి వస్తే; 

కథ; సికింద్రాబాద్ లో సన్ షైన్  కాలనీ లో జరిగే కథ ఇది. శ్రీను (అభిజీట్),సత్య(రశ్మి), చిన్ని వాళ్ళ తాతయ్య అమ్మమ్మల తో నివసిస్తారు. వాళ్ళకి అభి (కౌషిక్),నాగరాజు (సుధాకర్) తో స్నేహం కుదురుతుంది.అభి పారు(శ్రేయ) ను ప్రేమిస్తువుంటాడు. పారు కి మిస్ ఇండియా అవ్వాలనే కుతూహలంగా వుంటుంది. ఆలాగే శ్రీను అతని మరదలు పద్దు (శాగున్) ను ప్రేమిస్తూ ఉంటాడు.. నాగరాజు లక్ష్మి అనే అమ్మాయిని  ఒక పక్క ప్రేమిస్తూ మరో పక్క బ్యూటిషియన్   మాయ (అంజలా జవేరి)కి లైన్ వేస్తూ ఉంటాడు. ఈ ప్రేమ కథల మధ్య కీలక మలుపు   అమల పాత్ర..అదే శ్రీనుకి, అతని స్నేహితులకి వాళ్ళ అమ్మ గురించి చెడు విషయం తెలియడం. అది  ఏంటి, నిజం తెలుసుకున్న తరువాత ఇలాంటి పరిస్తుతులో వాళ్ళు అమ్మాయల మనసు గెలుచుకోగలరా ? ఈ ప్రశ్నలకు సమాధానం పెద్ద తెరపైనే చూడాలి. 

అమల అక్కినేని, అంజలా జవేరి, శ్రేయ, తళుక్కున  మెరిసినప్పటికి ఈ సినిమా జీవితం గురించి మంచి హితబోధనగా  నిలిచింది కాకపోతే ఇంకొంచం జనానికి నచ్చే టట్టుగా  తీస్తే బావుండేది.

విశ్లేషణ;  ఎప్పుడు అందంగా వుహించుకొనే జీవితం గురించి తెర పైన ఎంతో బాగా చుపెంచి, అలా   కాకుండా కష్టపడితేనే ఫలితం వస్తుందని చెప్పడంతో  కథ ముగుస్తుంది కాబట్టి ఈ సినిమాని చూసి సంతృప్తి పడచ్చు.
 
                                                                                                                    నాగ సాయి రమ్య 

2 comments:

  1. శేఖర్ కమ్ముల సినిమా అని అశతొ వెళితే కొంచెం నిరాశ పరిచింది.

    ReplyDelete
  2. thank-u for visiting my blog chinni gaaru.

    ReplyDelete

haaram logo