Wednesday 19 September 2012

శుభాకాంక్షలు .



నా బ్లాగ్ ను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికి మీ కుటుంబ సభ్యులకి వినాయకచవితి శుభాకాంక్షలు .

                                                                                                                                  నాగ సాయి రమ్య 

Saturday 15 September 2012

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం ఈజ్ మోర్ బ్యూటిఫుల్

 ;
నటీనటులు; శ్రియ, అమల, అంజలా జవేరి, అభిజీథ్,సుధాకర్,శాగున్, జార.
సంగీతం; మిక్కి జే మేయెర్.
దర్శకత్వం; శేఖర్ కమ్ముల.
నిర్మాత;  శేఖర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల సినిమా అంటేనే అందులో ఏదో ఆహ్లాదకరమైన అంశం. అది వాస్తవానికి సంబంధించి  . ఎంతో అధ్బుతమైన చిత్రీకరణ. వీటితో జనానికి ఏదో చెయ్యాలన్న కుతూహలం మాత్రం సినిమాలోకనిపిస్తూవుండడం  సహజం. గోదావరిలో అందమైన ప్రకృతిని మరింత అందంగా చూపెట్టి జనాల్లోని అక్కడ కాసేపు ఉండాలన్న కోరికను పుటించడం , లీడర్ లో ప్రస్తుత కాలంలో మన చుట్టూ వున్న   ప్రపంచం గురించి తెలుపడం, హ్యాపీ డేస్ వంటి సినిమా తో మనం కూడా కాలేజీ రోజులను తప్పకుండా ఎంజాయ్ చెయ్యాలి, అనే కుతూహలం అందరిలో కలిపించడంలో శేఖర్ దిట్ట. ఇక కథ లోపలి వస్తే; 

కథ; సికింద్రాబాద్ లో సన్ షైన్  కాలనీ లో జరిగే కథ ఇది. శ్రీను (అభిజీట్),సత్య(రశ్మి), చిన్ని వాళ్ళ తాతయ్య అమ్మమ్మల తో నివసిస్తారు. వాళ్ళకి అభి (కౌషిక్),నాగరాజు (సుధాకర్) తో స్నేహం కుదురుతుంది.అభి పారు(శ్రేయ) ను ప్రేమిస్తువుంటాడు. పారు కి మిస్ ఇండియా అవ్వాలనే కుతూహలంగా వుంటుంది. ఆలాగే శ్రీను అతని మరదలు పద్దు (శాగున్) ను ప్రేమిస్తూ ఉంటాడు.. నాగరాజు లక్ష్మి అనే అమ్మాయిని  ఒక పక్క ప్రేమిస్తూ మరో పక్క బ్యూటిషియన్   మాయ (అంజలా జవేరి)కి లైన్ వేస్తూ ఉంటాడు. ఈ ప్రేమ కథల మధ్య కీలక మలుపు   అమల పాత్ర..అదే శ్రీనుకి, అతని స్నేహితులకి వాళ్ళ అమ్మ గురించి చెడు విషయం తెలియడం. అది  ఏంటి, నిజం తెలుసుకున్న తరువాత ఇలాంటి పరిస్తుతులో వాళ్ళు అమ్మాయల మనసు గెలుచుకోగలరా ? ఈ ప్రశ్నలకు సమాధానం పెద్ద తెరపైనే చూడాలి. 

అమల అక్కినేని, అంజలా జవేరి, శ్రేయ, తళుక్కున  మెరిసినప్పటికి ఈ సినిమా జీవితం గురించి మంచి హితబోధనగా  నిలిచింది కాకపోతే ఇంకొంచం జనానికి నచ్చే టట్టుగా  తీస్తే బావుండేది.

విశ్లేషణ;  ఎప్పుడు అందంగా వుహించుకొనే జీవితం గురించి తెర పైన ఎంతో బాగా చుపెంచి, అలా   కాకుండా కష్టపడితేనే ఫలితం వస్తుందని చెప్పడంతో  కథ ముగుస్తుంది కాబట్టి ఈ సినిమాని చూసి సంతృప్తి పడచ్చు.
 
                                                                                                                    నాగ సాయి రమ్య 

Tuesday 11 September 2012

సినిమా ఓకే ఓకే


నటీనటులు; ఉదయనిది స్టాలిన్, హన్సిక, సంతానం, ఆర్య, సాయాజీ షిండే, శరణ్య మరియు తదితరులు.
దర్శకత్వం ;  రాజేష్ 
 సంగీతం; హర్రీస్ జయరాజ్ .
నిర్మాత; ఉదయనిది స్టాలిన్.

ఈ మధ్య తమిళ సినిమా వచ్చిందంటే చాలు ఎంత లేదన్న చూడాలన్న ఉత్సాహం వుంటుంది ఎందుకంటే అన్ని సినిమాలు వచ్చాయి మరి. ఒక తమిళ సినిమా వచ్చిందంటే ఈ సినిమా ఎలా వుంటుందో, ఏ ప్రయోగం చేసారో చూడాలి అని ఎంతో మందికి అనిపిస్తువుండడం చాల సహజం. కాని ఇప్పుడు వచ్చిన ఓకే ఓకే మాత్రం మన ఆశలకు  విరుధం. ఈ సినిమాచూస్తే  ఒక్క సారి చూశానులే ఓకే ఓకే అని అనిపిస్తుంది.

కథ; శ్రావణ్(ఉదయనిది స్టాలిన్ )  ఒక మల్టీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు. అతనితో పనిచేసె సహా ఉద్యోగి పర్తసరతి శ్రావణ్ కు మంచి స్నేహితుడు.పోలీసు ఆఫీసర్(సాయాజీ షిండే ) కూతురైన మీరా (హన్సిక )ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు శ్రావణ్. శ్రావణ్  మీరా ను ఎంత ప్రేమించిన తన పట్ల మీరా ప్రవంతించే తీరు కథలో లో కీలకాంశం. సినిమా లోని ప్రతి అంశం ఎత్తుకో పై ఎంతో లాగ నడిచింది.సినిమా అంత ఒక మంచి సినిమా లాగ ప్రేక్షకల దృష్టిలో నిలబడిపోతుంది .

ఎప్పుడు బావుండే హర్రీస్ జయరాజ్ సంగీతాన్ని మాత్రం ఒక మారు ఆలోచించే ఈ సినిమా పాటలు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా లో ఏ పాట విన్న ఏదో ఒక సినిమా అదే ఇంతకు ముందు జయరాజ్ చేసినవి గుర్తుకువస్తాయి. ఏక పోతే హన్సిక నటన; హన్సిక మాత్రం మంచి నటనను ప్రదసించనే  చెప్పాలి. ఇక పోతే సినిమా మొత్తం కొత్త మొహాలతో తీసిన సినిమా కాబ్బటి  సినిమా మొదలైన అరగంట వరుకు ఈ సినిమా లో నిమగ్నం అవడానికి సమయం పడుతుంది.

విశ్లేషణ; ఓకే ఓకే ఓకే అని వదిలేద్దమ్మని అనికుంటే ఒక సారి వెళ్లి చుడండి. కాదు ఓకే చాల బావుండాలని వుంటే మాత్రం ఆ ఆలోచనతో మాత్రం వెళ్ళకండి.


నాగ సాయి రమ్య 

Friday 7 September 2012

షిరిడి సాయి బాబా ; రివ్యూ



నటీనటులు; నాగార్జున, శ్రీకాంత్ , శరత్ బాబు, కమిలిని ముకర్జి  మరియు తదితరులు.
సంగీతం;  యం. యం .కీరవాణి 
దర్సకత్వం; కే. రాఘవేంద్ర రావు 
నిర్మాతలు; మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి 
బ్యానర్; సాయి కృప ఎంటైర్మైన్ట్ట్స్ .
కథ;  దేవతల ధైవస్తానంలో జరిగే కథ తో మొదలియే కథ తో సాయి బాబా ఈ ప్రపంచానికి రావడంతో ఈ సినిమా కథ మొదలవతుంది. 12 సంవత్సరాల సాయి బాబా షిరిడి కి అడుగు పెట్టి అక్కడ నుంచి హిమాలయాలకు జ్ఞానం సంపాదించడంకోసం వెళ్లి  జాతి మతాల గురించి ప్రతివోక్కరి జీవితాల గురించి తెలుసుకుని మల్లి తిరిగి వస్తాడు.ఎక్కడనుంచి కథలో  సాయి బాబా భక్తులుగా ఎలా మారుతారు, సాయి బాబా ను చివరి వరుకు కథ ఈ సినిమా ప్రధమ అంశాలు.
నాగార్జున అనగానే రొమాంటిక్ సినిమాలు మాత్రమె కాకుండా ఒక భక్తి రస మైన సినిమా కూడా గుర్తుకు రావడం మాములే. ఇలాగే ప్రతి వొక్కరి అంచనాలను మించి నట్టుగా ఈ సినిమా వుండడం అందులో శ్రీకాంత్, కమలిని ముకర్జి వంటి చక్కటి  నటీనటులు మంచి నటనను ప్రదర్సనించడం కూడా చెప్పుకోధగ్గవిషయం. కమిలిని మొదటి భక్తి రస చిత్రం లో నటించనప్పటికి మంచి మార్కులే క్కోట్టేసింది. సాయి బాబా సినిమాలు ఇదివరుకు ఉన్నప్పటికీ ఈ సినిమా  ప్రజల ఆదరణ పొందుడంతో ఈ సినిమా ఒక ప్రత్యమైన సినిమా అనే  చెప్పాలి 
విశ్లేషణ ; ఈ సినిమాని ఎన్ని సార్లైనా చూడచ్చు.

Thursday 6 September 2012

జులాయి; theatres lo జులాయి

నటీనటులు; అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్ర ప్రసాద్ ,సోను సూద్, తనికేల్లభారని, కోట శ్రీనివాసరావు, తదితరులు .
దర్సకత్వం; త్రివిక్రం.
సంగీతం; దేవి శ్రీ ప్రసాద్.
బ్యానర్; హారిక మరియు హాసిని
విడుదల;ఆగష్టు 9 2012.
త్రివిక్రం, అల్లు అర్జున్ కలయిక అనగానే మంచి కథ ని వూహించడం మామూలే. కానీ ఈ కథ కాస్త అందరిని అంచనాలను నీరుకార్చేస్తోంది. అసలే ప్రస్తుత కాలంలో జులాయిల గొడవలు ఎక్కువవుతున్న తరుణం లో ఈ కథ ద్వార ఏమి చెప్పాలను కున్నారో సరిగ్గా చెప్పలేదనే డైరెక్టర్ త్రివిక్రం గురించి చెప్పలి. ఒక కథను తీసుకుంటున్న సమయంలోనే ఎటువంటి జాగ్రతలు తీసుకోవాలో సరిగ్గా తీసుకోలేదనే ఇక్కడ చెప్పాలి.నటీనటుల విషయంలో, మాటల విషయంలో, పాటల విషంలో  తీసుకొన్న ప్రేత్యేకమైన శ్రద్ధ కథ మీద పెట్టివుంటే బావుండేది.
కథ; జులాయి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినా రవీంద్ర (అల్లు అర్జున్ ) కి సంభందిచ కథ. రవీంద్ర  డబ్బు ని చాల సులభంగా సంపాదిన్చాచు అనుకునే కుర్రాడు. కాని ఎప్పుడు నీతి నీజాయితీల అడ్డుగోడ మాత్రం దాటాడు . అతని తండ్రి(తనికెళ్ళ భరణి ) మాత్రం కష్టాని నమ్ముకునే వ్యక్తి. ఇది ఇలా వుండగా , ఒకసారి రవీంద్ర కిబిట్టు ( సూను సూద్) బ్యాంకు లో దొంగతనం చేయాలనుకోవాలన్నవిషయం  తెలుస్తుంది. వెంటనే పోలీసు కొమ్మిష్నేర్ మాణిక్యం (రావు రమేష్ ) కి చెప్పి పట్టిస్తాడు.ఈ విషయం లోనే బిట్టు తమ్ముడు లాల (షఫీ ) చనిపోతాడు.తన తమ్ముడు చనిపోవాడానికి కారణం రవీంద్ర అని అతని మీద పగ పట్టడంతో కథ ఇంకొక మలుపు తిరిగుతుంది. ఎలాగైనా మాణిక్యం రవీంద్ర ని కాపాడాలని హైదరాబాద్ లో వుంచుతాడు.  మాణిక్యం దగ్గర వున్నా రవీంద్ర తనను తాను  ఎలా కాపాడుకుంటాడు, ఇలేయన ప్రేమ విషయం, తన తల్లితండ్రుల కలయిక ఈ విషయాలన్ని సినిమా చూసి  తీసుకోవాల్సిందే. 
జులాయిగా అల్లు అర్జున్ నటనను మెచ్చుకోవలసిందే. జులాయి ఆకతాయి కుర్రడిది కాబటి ఇలియానా కు నటన ఆస్కారం తక్కువవుంది. సంగీతం ప్రేత్యేకమినే ఆకర్షణగా నిలిచాయి. 
విశ్లేషణ; ఈ సినిమా ఒక చక్కటి వినోదాని అందించే సినిమా.

                                                                                                                     నాగ సాయి రమ్య.

Wednesday 5 September 2012

పాడుతా తియ్యగా

హలో,

ఎలా వున్నారు ? అంతా  బావున్నారా ? సారీ అండి ఇన్నాలు డుమ్మా కొట్టాను .అయినప్పట్టికి  ఎంతో బాగా నా బ్లాగ్ ని ఆదరించారు. అందుకు నా థాంక్స్. ఇకమీదట్నుంచి ఎప్పటికప్పుడు మీతో నా బ్లాగ్ తో టచ్ లో ఉండాలనుకుంటున్నా.
 మరి, ఇవ్వాల్టి నా టాపిక్ ఏంటో తెలుసా? అదేనండి, ఎంతటి వారినైనా తన స్వరాల మంత్రాలతో మాయ చేసే పాడుతా తియ్యగా ప్రోగ్రాం గురించి. ఈ ప్రోగ్రాం విన  సోంపు గ వుంటుంది. అంతే కాదు ఈ ప్రోగ్రాం ఎంతో బంధాలను కూడా గట్టిపడుస్తుంది. అదేనండి ఎంతో మంది ఈ ప్రోగ్రాంని చూస్తువుంటే బంధువుల్లో   వున్నా భాంధవ్యాలను  కూడా గుర్తుచేస్తుంది   ఈ చక్కటి ప్రోగ్రాం.ఈ ప్రోగ్రాం ని ఎవ్వరు చూసినా  క్షణం లోనే ఈ ప్రోగ్రాం 'మన చుట్టాల్లో ఎవరికీ ఇష్టమో చెప్పు' అని అడిగి ఇలాంటి చిన్న  చిన్నచిలిపి చిలిపి ప్రశ్నలకు పాడుతా తీయగా ప్రోగ్రాం ఒక బాంధవ్యాలను కలిపే వేదికగా నిలిచింది. ఈ విదంగా  పిల్లల దగ్గర్నుంచి పెద్దవాల  వరుకు అందరిని ఆకర్షిస్తుంది ఈ ప్రోగ్రాం.
ఇక ఈ ప్రోగ్రాం ని చూసి ఎంతో మంది చిన్నపిల్లలకి కూడా సంగీతం  నేర్చుకోవాలన్న  ఆత్రుత కూడా కలిగిమ్పచేస్తుంది . ఈ ప్రోగ్రాం ద్వారా సంగీతం మీద మక్కువ మాత్రమే కాకుండా ఎంతో మందికి చదువు కూడా చాల ముఖ్యమన్న విషయం ఈ ప్రోగ్రాం ని మొదటినుంచి నిర్వహిస్తున్న బాలు గారు ఎప్పటిక్కప్పుడు తెలుపుతూనే వున్నారు.


- నాగ సాయి రమ్య 

Thursday 29 December 2011

rajanna rajyam

నటీనటులు; నాగార్జున, స్నేహ,బేబీ అనీ,శ్వేత మీనన్ మరుయు తదితరులు.
దర్సకత్వం; విజయేంద్ర ప్రసాద్.
నిర్మాత; అక్కినేని నాగార్జున.
సంగీత దర్సకత్వం; యం. యం . కీరవాణి
నాగార్జున ఇప్పుడు వైవిధ్య కరమైన సినిమాలు చెయ్యాలని తహతహ లాడు తున్నాడు. అందుకే గగనం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తరువాత ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాని ప్రముక దర్శకుడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్సకత్వం చెయ్యగా అతడి కుమారుడు రాజమౌళి ఆక్షన్ సన్నివేశాలను తెరక్కించారు. ఈ సినిమా ఈ నెల 22 న విడుదలైయింది.ఈ సినిమా ఎలా వుందో ఓకసారి చుద్దాం
                                                                                  కథ;
   మల్లమ్మ అనే ఒక చిన్నారి పాపా చాల మంచి గాయని.తను ఒక పెద్ద మనిషి అండ లో  వుంటుంది.ఒకసారి అతడు మల్లమ్మను చదివించాలాని దొరసాని దగ్గరకు తీసుకుని వెళ్తాడు. మల్లమ్మ దొరసానికి తన పాటని వినిపించగా తన కూతురు లోని లేని ప్రతిభను  మల్లమ్మ లో వుండడం భరిచలేక చంపాలని భయపెడు తుంది .కాని అనుకోకుండా  మల్లమ్మ మల్లి పాడడం తో  తన ఇల్లు కాలి  చేయిస్తుంది. మల్లమ్మను  ఢిల్లీ లో వున్నా జవహర్లాల్ నెహ్రు మాత్రమే కాపదగాలనని తెలుసుకున్న నాగార్జున అక్కడికి తీసుకెళతాడు.అక్కడకి కూడా దొరసాని మనుషులు తన పై దాడి చెయ్యడం చూసి తన జీవితాన్ని అంతం చెయ్యాలని అనుకున్న సమయంలో రాజన్న కథ విని స్పూర్తి పొందుతుంది.
కష్టాలను ఎడుకోవడానికి సిద్డంమౌతుంది. అది ఎలా అనేదే ఈ రాజన్న కథ. అది పెద్ద తేరా మీద చూడాల్సిందే. 

                      -నాగ సాయి రమ్య 

 

haaram logo